తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రూ.4 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం - red sandalwood smugglers arrested latest news update

ఆంధ్రప్రదేశ్​లో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడంలో కడప జిల్లా పోలీసులు ముందడుగు వేశారు. 4 కోట్ల రూపాయల విలువైన దుంగలు స్వాధీనం చేసుకోవడం సహా.. 30 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు.

స్మగ్లర్ల ఆట కట్టించిన పోలీసులు.. రూ.4 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం
స్మగ్లర్ల ఆట కట్టించిన పోలీసులు.. రూ.4 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

By

Published : Dec 2, 2020, 7:39 PM IST

ఏపీలోని కడప జిల్లాలోని మైదుకూరు, రాజంపేట నియోజకవర్గాల్లో ఏకంగా 4 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోవడం సహా.. 30 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఖలీల్‌ఖాన్‌, అఫ్రోజ్‌ ఖాన్‌ ఉన్నారు.

జిల్లా నుంచి దుంగలను బెంగళూరుకు తరలిస్తుండగా గుర్తించిన పోలీసులు 9 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాను అడ్డుకున్నారు. బెంగళూరు నుంచి విదేశాలకు ఎర్రచందనం తరలిపోతోందని గుర్తించినట్లు ఎస్పీ అన్బురాజన్‌ వెల్లడించారు. మరికొందరు బడా స్మగ్లర్ల కోసం గాలిస్తున్నామని చెప్పారు.

స్మగ్లర్ల ఆట కట్టించిన పోలీసులు.. రూ.4 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

ఇవీ చూడండి:గ్యాస్ సిలిండర్ పేలి మూడు ఇళ్లు దగ్ధం

ABOUT THE AUTHOR

...view details