ములుగు జిల్లా వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీ బస్ రోడ్డుపై ఉన్న గేదెలను ఢీకొట్టింది. ఘటనలో 4 గేదెలు మృతి చెందాయి.
విషాదం: మినీబస్ ఢీకొని 4 గేదెలు మృతి - ములుగు జిల్లాలో గేదెలు మృతి వార్తలు
ములుగు జిల్లా గుమ్మడిదొడ్డి సమీపంలో ఓ మినీ బస్ గేదెలను ఢీకొట్టింది. ఘటనలో 4 గేదెలు మృతి చెందాయి.
![విషాదం: మినీబస్ ఢీకొని 4 గేదెలు మృతి 4 buffaloes killed in minibus collision](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7980353-547-7980353-1594445528247.jpg)
విషాదం: మినీబస్ ఢీకొని 4 గేదెలు మృతి
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మినీ బస్ కలకత్తా నుంచి కార్మికులను తీసుకుని హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. మరోవైపు మృతి చెందిన గేదెల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీచూడండి: ప్రోటోకాల్ పాటించక ఘర్షణ.. గాయపడ్డ పశుసంవర్ధక అధికారి