డబ్బులు లెక్కించే యంత్రంలోని కడ్డీల్లో పెట్టి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి నగరానికి వచ్చిన వ్యక్తి నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో 373 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు.
శంషాబాద్ విమానాశ్రయంలో 373 గ్రాముల బంగారం పట్టివేత - బంగారం స్వాధీనం వార్తలు
బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు స్మగ్లర్లు సరికొత్త పంథాలను అనుసరిస్తున్నారు. మనీ కౌంటింగ్ యంత్రాల ద్వారా బంగారం తరలింపుకు పాల్పడుతున్నారు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో 373 గ్రాముల బంగారాన్ని ఈ యంత్రాల ద్వారా తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో 373 గ్రాముల బంగారం పట్టివేత
రెండు డబ్బులు లెక్కించే యంత్రాల్లోని కడ్డీల్లో ఉంచి బంగారం తరలింపుకు నిందితుడు యత్నించాడు. ఈ బంగారం విలువ దాదాపు రూ.19లక్షల 14 వేలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి:భాజపా కార్పొరేటర్ అనుచరులపై తెరాస కార్యకర్తల దాడి