నకిలీ పత్రాలతో రూ.300 కోట్ల విలువైన స్థలం ఆక్రమణ - land occupied in hyderabad
18:53 September 17
నకిలీ పత్రాలతో రూ.300 కోట్ల విలువైన స్థలం ఆక్రమణ
హైదరాబాద్లోని వందలకోట్ల విలువైన స్థలాన్ని నకిలీ పత్రాలతో అక్రమార్కులు కబ్జా చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12లోని 4.5 ఎకరాల స్థలం వివాదం చోటుచేసుకుంది. అదే ప్రాంతంలోని 2.21 గుంటలు కొన్న నిందితుడు నజీబ్ అహ్మద్... 7 ఎకరాల స్థలం కొన్నట్లు నకిలీ పత్రాల సృష్టించాడు. పక్క స్థలం తమదే అంటూ జీహెచ్‌ఎంసీ నుంచి భవన నిర్మాణ అనుమతులు సైతం తెచ్చుకున్నారు.
విషయం తెలుసుకున్న స్థల యజమానులు... బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. నకిలీ పత్రాలు సమర్పించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడు నజీబ్ అహ్మద్, భవన నిర్మాణ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు.