ఏపీలోని చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఏడో మైలురాయి వద్ద.. కదిరి ఓబనపల్లె బస్ స్టాప్ దగ్గర విద్యుదాఘాతంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఏడో మైలురాయి సమీపంలో ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం.. ముగ్గురు మృతి! - పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం.. ముగ్గురు మృతి!
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ఏడో మైలురాయి వద్ద దుర్ఘటన జరిగింది. విద్యుదాఘాతంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
పవన్ కల్యాణ్ ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం.. ముగ్గురు మృతి!
మృతులను జిల్లాలోని కడపల్లె ప్రాంతానికి చెందిన రాజేంద్ర(31), సోమశేఖర్(29), అరుణాచలం(20) గా గుర్తించారు. గాయపడిన మిగతా ముగ్గురు యువకులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఇవీ చూడండి: 'బాలికపై అత్యాచారం చేసిన 139 మందిని కఠినంగా శిక్షించాలి'
Last Updated : Sep 1, 2020, 11:11 PM IST