కుటుంబ కలహాలతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు నగరం ఓబనపల్లె హౌసింగ్ కాలనీలో ఈ దారుణం జరిగింది. కుమార్తెతోపాటు దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. లారీ డ్రైవర్గా పని చేసే రవికి భార్య భువనేశ్వరి, తొమ్మిదేళ్ల కుమార్తె గాయత్రీ, ఏడేళ్ల కుమారుడు సాయి ఉన్నారు. కొంతకాలంగా కుటుంబ కలహాలతో కలత చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.
పెను విషాదం... ఒకే కుటుంబంలో ముగ్గురు బలవన్మరణం - ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
చిత్తూరులో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
![పెను విషాదం... ఒకే కుటుంబంలో ముగ్గురు బలవన్మరణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4953190-902-4953190-1572847151171.jpg)
suicide
ఆదివారం అర్ధరాత్రి ఇంటికి వచ్చిన రవి...శీతల పానీయంలో పురుగుల మందు కలిపి భార్య భువనేశ్వరి, కుమార్తె గాయత్రి, కుమారుడు సాయికి ఇచ్చాడు. పానీయాన్ని సేవించిన రవి, భువనేశ్వరి, గాయత్రి ఇంట్లోనే మృతి చెందారు. కుమారుడు సాయి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరులో విషాదం... ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య
ఇదీ చూడండి:హరియాణాలో బోరుబావిలో పడ్డ చిన్నారి మృతి