కుటుంబంలో అల్లుడి చిచ్చు... కలహాలతో ముగ్గురు ఆత్మహత్య - కడప జిల్లాలో కుమార్తెలు ఆత్మహత్య వార్తలు
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ముగ్గురు ప్రాణాల్ని అంతమొందించింది. భవిష్యత్తును భారం అనుకున్నారేమో ఆ కుమార్తెలు తండ్రి మరణించిన వెంటనే ప్రాణాలు వదిలారు. కడప జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
SUICIDE
By
Published : Aug 8, 2020, 2:50 PM IST
మామా, అల్లుళ్ల మధ్య ఏర్పడిన తగాదాలు ముగ్గురు బలవన్మరణానికి కారణమయ్యాయి. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీకి చెందిన బాబు రెడ్డి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకునే సమయంలో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన చావుకు తన అల్లుడు సురేష్ కుమార్ రెడ్డే కారణం అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని తనవు చాలించాడు.
తండ్రి మరణంతో కుంగిపోయిన పెద్ద కుమార్తె శ్వేత, చిన్న కుమార్తె సాయి ఎర్రగుంట్ల-కమలాపురం రైల్వే మార్గంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
అసలేం జరిగిందంటే?
ఏడాది కిందట బాబురెడ్డి కుమార్తె శ్వేతను ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురానికి చెందిన సురేష్ కుమార్ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. గత ఆరు నెలల నుంచి అల్లుడు, కుమార్తె మధ్య వివాదాలు తలెత్తాయి. తరచూ కుమార్తెను అల్లుడు వేధించడంతో తట్టుకోలేక కుమార్తె పుట్టింటికి వచ్చేసింది. ఈ మధ్య కాలంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు మరింత ముదిరినట్లు స్థానికులు చెబుతున్నారు. అల్లుడు పెట్టే వేధింపులు తట్టుకోలేక... కుమార్తె ఇంటివద్ద పడుతున్న బాధను చూడలేక తనువు చాలించాలని నిర్ణయం తీసుకున్నాడు బాబు రెడ్డి.
తండ్రిమరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య
తండ్రి మరణంతో ఇద్దరు కుమార్తెలు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం బాబురెడ్డి భార్య మాత్రమే కుటుంబంలో జీవించి విషాదవార్త తెలిసి కుమిలి పోతున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబంలో అల్లుడి చిచ్చు... కలహాలతో ముగ్గురు ఆత్మహత్య