తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గుట్కా స్థావరాలపై దాడి.. రూ. 3.2 లక్షల విలువైన గుట్కా స్వాధీనం - taskforce raids on gutka places

కామారెడ్డి పట్టణంలో టాస్క్​ఫోర్స్​ అధికారులు గుట్కా స్థావరాలపై దాడులు నిర్వహించారు. అక్రమంగా గుట్కా విక్రయిస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. రూ. 3.2 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.

3 lakh worth illegal gutka seized by task force police at kamareddy district
గుట్కా స్థావరాలపై దాడి... రూ. 3.2 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

By

Published : Oct 29, 2020, 10:45 PM IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గుట్కా స్థావరాలపై టాస్క్​ఫోర్స్​ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమంగా గుట్కా విక్రయిస్తున్న శ్రీనివాస్​, సతీశ్​​, వినయ్​, శ్రీకాంత్​, ఇజాజ్​, అనిల్​పై కేసు నమోదు చేశారు.

నిందితుల నుంచి సుమారు రూ. 3.2 లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల్లో ఇన్​స్పెక్టర్​ అభిలాష్​, సిబ్బంది పాల్గొన్నారు. ఇలాంటి చట్టవ్యతిరేకమైన చర్యలకు ప్రజలు పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చదవండి:భార్య కాపురానికి రాలేదని యువకుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details