నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మూడోవార్డులో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు... ఎల్ఆర్ క్వార్టర్స్‌లో 3 ఇళ్ల గోడలు నేలమట్టమయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధాకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు.
బోధన్‌లో భారీ వర్షాలకు 3 ఇళ్లు నేలమట్టం - nizamabad district latest news
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు బోధన్పట్టణంలోని 3 ఇళ్లు నేలమట్టమయ్యాయి. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధాకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు.
![బోధన్‌లో భారీ వర్షాలకు 3 ఇళ్లు నేలమట్టం 3 houses demolished due to heavy rains in Bodhan, nizamabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8460850-586-8460850-1597734022244.jpg)
బోధన్‌లో భారీ వర్షాలకు 3 ఇళ్లు నేలమట్టం
అనంతరం మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులకు ఫోన్లో మాట్లాడి వారికి వాస్తవ పరిస్థితిని తెలియజేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడుస్తున్న సమయంలో ఎల్ఆర్ క్వార్టర్స్‌లను కార్మికుల కోసం నిర్మించారని కొత్తపల్లి రాధాకృష్ణ అన్నారు. ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదని.. వాటిని వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు. క్వార్టర్స్‌లో నివసిస్తున్న ప్రజలకు పట్టాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా