విశాఖ జిల్లాలో 1,925 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు తెలిపారు. ఈ నెల 21న టాటా కంటైనర్ ట్రక్‌లో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం అందిందన్నారు. నిఘా పెట్టి విశాఖ జిల్లా అగనంపూడి టోల్‌గేటు దగ్గర ఆ వాహనాన్ని గుర్తించామని వెల్లడించారు.
విశాఖలో రూ.3.85 కోట్ల గంజాయి స్వాధీనం, భద్రాచలం నుంచే లోడింగ్ - ap crime news
ఏపీలోని విశాఖ జిల్లాలో డీఆర్‌ఐ అధికారులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో అగనంపూడి టోల్గేట్ వద్ద కాపు కాసిన సిబ్బంది... టాటా కంటైనర్ ట్రక్‌లో సరకును గుర్తించారు. డ్రైవర్‌ను అరెస్టు చేశారు.
విశాఖ జిల్లాలో రూ.3.85 కోట్ల గంజాయి స్వాధీనం
గంజాయి రవాణాకు వీలుగా డ్రైవర్ సీటు వెనక, పై భాగంలో ప్రత్యేకంగా అరలు తయారు చేయించారని తెలిపారు. భద్రాచలంలో ఆ ట్రక్‌ను లోడ్ చేసి అలహాబాద్ తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. గంజాయి, వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. గంజాయి విలువ 3.85 కోట్ల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు.
ఇవీచూడండి:కేమన్ ఐలండ్స్‌లో అగ్రిగోల్డ్ సొమ్ము..!