మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం కొత్తపల్లిలో మూడు ఎలుగుబంట్లు రెచ్చిపోయాయి. గ్రామానికి చెందిన కురుమ మొగులయ్య అనే రైతు... రోజులాగే ఉదయం ఐదున్నర సమయంలో పొలానికి బయలుదేరాడు. గ్రామ శివారులోని బతుకమ్మకుంట దాటగానే మూడు ఎలుగుబంట్లు మొగులయ్య మీద ఒక్కసారి దాడి చేశాయి.
రైతుపై ఎలుగుబంట్ల దాడి... తీవ్రగాయాలు - medak latest news
వేకువజామున పొలానికి వెళ్తున్న రైతుపై మూడు ఎలుగుబంట్లు దాడికి తెగబడ్డాయి. తీవ్రంగా గాయపరిచాయి. రైతు అరుపులకు స్పదించిన స్థానికులు ఎలుగుబంట్లను తరివేసి... మెదక్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం బాధితున్ని ఆస్పత్రికి తరలించారు.
3 bears attack on farmer and severely injured
రైతు అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించి ఎలుగుబంట్లను తరిమివేశారు. ఈ దాడిలో బాధితుని తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతరం అంబులెన్స్ ద్వారా మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు.