క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులను శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 5లక్షల 60 వేల నగదు, 5 చరవాణీలు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రాంకోఠిలో ఆటోమొబైల్ దుకాణ యజమాని మహేంద్ర కుమార్ ఈ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా ఆన్లైన్ ద్వారా పలువురి నుంచి బెట్టింగ్ స్వీకరిస్తున్నాడు.
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు అరెస్ట్ - cricket betting in hyderabad
ఆన్లైన్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లకు బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల కలెక్షన్ కోసం పెట్టుకున్న ఇద్దరు సహాయకులను సైతం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 5 లక్షల 60 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
3 arrested for ipl cricket betting in hyderabad
ఇద్దరు సహాయకులను ఏర్పాటు చేసుకొని డబ్బులు కలెక్షన్ చేయిస్తున్నాడు. రాజేంద్రనగర్లోని ఉప్పరపల్లిలో డబ్బులు తీసుకోవడానికి వచ్చిన ఇద్దరు సహాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా మహేంద్ర కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు.