తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

24 లక్షల విలువైన గంజాయి స్వాధీనం - suryapet district latest news today

పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా... గంజాయి రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. పలు మార్గాల ద్వారా అక్రమంగా తరలిస్తూనే ఉన్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో అక్రమంగా తీసుకెళ్తున్న 200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 24 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

24 lakh worth of cannabis seized at suryapet district
24 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

By

Published : Dec 5, 2020, 6:01 PM IST

24 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

సూర్యాపేట జిల్లాలో 24 లక్షల విలువైన 200 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మద్దిరాల మండలం పోలుమల్ల క్రాస్‌ రోడ్డు వద్ద వాహన తనిఖీల్లో గంజాయి పాకెట్లను గుర్తించిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్నారని పోలీసులు వెల్లడించారు.

వారి నుంచి రెండు కార్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా వారు గత కొంత కాలంగా విశాఖపట్నం జిల్లా చింతూరు ఏరియా నుంచి గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్, మహారాష్ట్రకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. విశాఖలో కిలో గంజాయి వేయి రూపాయలకు కోనుగోలు చేసి.. మహారాష్ట్రలో కిలో 4వేల రూపాయలకు అమ్ముతున్నామని వారు అంగీకరించారని పోలీసులు పేర్కొన్నారు.

భూక్యా సాయి, భూక్యా నవీన్ కుమార్, గుండు నరేశ్, ముగ్గురు నేరస్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్​కు పంపినట్లు పోలీసులు వివరించారు. అక్రమ రవాణా, అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పువని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చూడండి:లైవ్ వీడియో: ప్రాణాల మీదికి తెచ్చిన తొందరపాటు

ABOUT THE AUTHOR

...view details