తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గత నాలుగు రోజుల్లో 203 మంది అదృశ్యం.. కారణాలివేనా? - తెలంగాణలో అదృశ్యం వార్తలు

రాష్ట్రంలో గత నాలుగు రోజుల్లో రెండు వందల మంది అదృశ్యమైనట్టు కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. కేవలం నిన్న ఒక్క రోజే 65 మంది కనిపించకుండా పోవడంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అధికశాతం మంది ఇంట్లో కుటుంబసభ్యులతోనో, తల్లిదండ్రులతోనో గొడవపడి వెళ్లిపోయినవారేనని... అలా వెళ్లిన వారు తిరిగి వారే ఇంటికి చేరుకునే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

203 women went missing in telanagana in last four days
గత నాలుగు రోజుల్లో 203 మంది అదృశ్యాలు.. కారణాలివేనా?

By

Published : Oct 30, 2020, 8:51 PM IST

తెలంగాణలో గడిచిన నాలుగు రోజుల్లో 203 మంది అదృశ్యమయ్యారు. కనిపించకుండా వెళ్లిపోయిన వారి విషయంలో పోలీస్‌స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. గత నాలుగు రోజుల్లో అదృశ్యమైన వారి విషయంలో... పోలీసులు తమ అధికారిక వైబ్‌సైట్‌ వివరాలు పొందుపరిచారు. నిన్న ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 65 మంది కనిపించకుండా పోవడం చర్చనీయాంశమైంది. నిన్న హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 13, రాచకొండ కమిషనరేట్‌లో 8, సైబరాబాద్‌లో 11 అదృశ్యమైన కేసులు నమోదయ్యాయి. గత ఏడాది 20 వేలకు పైగా అదృశ్యం కాగా... ఈ ఏడాది గత ఎనిమిది నెలల్లో దాదాపు 1300 మంది కనిపించకుండా పోయినట్టు పోలీసు రికార్డుల ద్వారా తెలుస్తోంది.

తేదీ(అక్టోబర్) 26 27 28
మిస్సింగ్​ కేసులు 65 63 67

తిరిగొస్తున్నా.. చెప్పట్లేదు!

కొందరు ఇళ్ల నుంచి చెప్పకుండా వెళ్లిపోగా... మరికొందరు బంధువులు, స్నేహితుల ఇళ్లకని వెళ్లి తిరిగి రావడం లేదని పోలీసులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది ఇంట్లో కుటుంబసభ్యులతో గొడవపడి లేదా ప్రేమ వ్యవహారం కారణంగా వెళ్లిపోయినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ విధంగా కనిపించకుండా పోతున్న వారు తిరిగి ఇళ్లకు చేరిన తర్వాత... వారు తిరిగి వచ్చేసినట్టు పోలీసు రికార్డుల్లో మాత్రం ఎక్కువ శాతం నమోదు కావడం లేదు. అదృశ్యమైన వారు తిరిగి వచ్చినట్టు కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వట్లేదు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కనిపించకుండా పోయిన వారి కుటుంబసభ్యులు, బంధువులు... బాధితులు ఇళ్లకు చేరిన తర్వాత ఫిర్యాదు చేసిన పోలీస్‌ఠాణాలకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

అదృశ్యమవుతున్న వారి విషయంలో ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత పోలీసులు అన్ని విషయాలు ఆరా తీసి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నారని, పూర్వాపరాలు అన్ని తెలుసుకుని విచారణ జరుపుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

ఇదీ చదవండిఃసిద్ధమైన రైతువేదికలు... రేపు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం

ABOUT THE AUTHOR

...view details