కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బండ రామేశ్వరం పల్లి గ్రామంలో మాదాసు బుచ్చవ్వకి చెందిన గొర్రెల మందపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈ ఘటనలో సుమారు 200 గొర్రెలు మృతి చెందాయి.
గొర్రెల మందపై కుక్కల దాడి.. 200 మూగజీవాలు మృతి - కుక్కల దాడిలో గొర్రెలు మృతి
వీధి కుక్కలు విజృంభించాయి. ఓ గొర్రెల మందపైదాడికి దిగాయి. ఈ ఘటనలో సుమారు 200 గొర్రెలు చనిపోవడంతో... వాటి మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబం రోడ్డున పడింది. ఈ ఘటన మాచారెడ్డి మండలంలో చోటుచేసుకుంది.
వీటి విలువ ఎనిమిది లక్షల పైచిలుకు ఉంటుందని బుచ్చవ్వ తెలిపింది. 200 గొర్రెలు మృతి చెందడంతో వారి కుటుంబం వీధిన పడినట్లయిందని బుచ్చవ్వ కన్నీరు మున్నీరుగా విలపించింది. తన ముగ్గురు కుమారులు... వారి గొర్రెలను కూడా తల్లి దగ్గరే ఉంచడంతో ఎక్కువ నష్టం జరిగింది. గొర్రెల మందను రాళ్ల కంచె ఉన్న గుడిసెలో ఉంచడంతో... దాడి సమయంలో గొర్రెలు తప్పించుకునే వీలులేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తన కుటుంబాన్ని ఆదుకోవాలని బుచ్చవ్వ వేడుకుంటోంది.
ఇదీ చూడండి:నిశ్చితార్థం మరుసటి రోజే... శవమై తేలింది!