తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

లైంగిక దాడి కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల కారాగారం - POCSO court sentences rape convict to 20 years in jail

హైదరాబాద్​లో పలు ఘటనల్లో బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన కేసుల్లో నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిందితులకి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది.

20 years in prison for defendants in sexual assault cases in hyderabad
లైంగిక దాడి కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల కారాగారం

By

Published : Dec 10, 2020, 1:14 AM IST

మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన ఇద్దరు వ్యక్తులకు వివిధ కేసుల్లో న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2017లో లాలాగూడ పీఎస్ పరిధిలో ఐదేళ్ల చిన్నారి ట్యూషన్​కి వెళ్తుండగా ప్రభాకర్ అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించి తల్లిదండ్రులు లాలాగూడ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఆ ఘటనపై నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితునికి 20 సంవత్సరాల జైలుశిక్షతోపాటు రెండు వేల రూపాయల జరిమానా విధించింది.

మరో కేసులో 2018లో యూసఫ్​గుడలో నాలుగేళ్ల చిన్నారి షాప్​కి వెళ్లి వస్తుండగా నిందితుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఆ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నాంపల్లి పోక్సో కోర్టు నిందితునికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు 12 వేల రూపాయల ఫైన్​ విధించింది.

ఇదీ చూడండి :ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి లారీ దగ్ధం...వృద్ధునికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details