నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్ రెండవ నెంబర్ ప్లాట్‌ఫామ్ బయట ముళ్లపొదల్లో ఓ మగ శిశువు మృతదేహం లభ్యమైంది. పశువుల కాపరి లతీఫ్... మృత శిశువును పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా భావించి కేసు నమోదు చేశారు.
ముళ్ల పొదల్లో రెండేళ్ల చిన్నారి మృతదేహం లభ్యం
నిర్మల్ జిల్లా బాసర రైల్వే స్టేషన్లో సుమారు రెండేళ్ల చిన్నారి మృత దేహం తీవ్ర కలకలం రేపింది. రెండవ నెంబర్ ప్లాట్‌ఫారమ్ వద్ద ఉన్న ముళ్లపొదల్లో చిన్నారి మృతదేహం గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
2-year-old-boy-dead-body-caught-in-basara-railway-station
శిశువుకు సుమారు రెండు సంవత్సరాలు ఉంటాయని పోలీసులు అంచనా వేశారు. కన్న తల్లిదండ్రులే చంపి పడేసారా..? లేక కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారా...? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.