నిజామాబాద్ నగర శివారులోని బొర్గం (పి) బ్రిడ్జిపై భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. అదనపు ఎసీపీ ఉషా విశ్వనాథ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఒరిస్సాలోని మల్కాజిగిరి జిల్లా నుంచి మహారాష్ట్ర నాందేడ్ వెళ్తున్న కారును, ఓ మహేంద్ర బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా భారీగా గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు.
రూ.16 లక్షల విలువైన 152 కిలోల గంజాయి పట్టివేత
పశువులు దాణా అయిన తవుడు సంచుల్లో భారీ ఎత్తున గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ.16 లక్షల విలువైన 152 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు డ్రైవర్లతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
16 lakhs worth ganza caught by nizamabad police
రూ.16 లక్షల విలువైన 152 కిలీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశువుల దాణా అయిన తావుడు బస్తాల్లో గంజాయి ప్యాకింగ్ చేసి తరలిస్తున్నారు. వాహనాల డ్రైవర్లు అభిజిత్ సర్కార్, మోహన్ సహాతో పాటు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 9 సెల్ఫోన్లు, వెయ్యి రూపాయల నగదు, బొలెరో, ఓ కారును సీజ్ చేసినట్లు అదనపు ఎసీపీ ఉషా విశ్వనాథ్ వెల్లడించారు.