నారాయణపేట జిల్లా మద్దూరులో అక్రమంగా నిల్వ చేసిన 155 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పౌరసరఫరాల అధికారులతో కలిసి కిరాణ షాపుపై దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు.
కిరాణా దుకాణంలో 155 క్వింటాళ్ల రేషన్‌బియ్యం పట్టివేత - illegal storage pds rice captured
నారాయణపేట జిల్లా మద్దూరులో ఓ కిరాణా దుకాణంపై పోలీసులు, పౌరసరఫరాల అధికారులు దాడులు చేశారు. 155 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం స్వాధీనం
ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. మద్దూరు పోలీసు స్టేషన్ పిరిధిలో రేషన్ బియ్యం ఎవరు అమ్మినా, అక్రమంగా నిల్వ ఉంచినా, రవాణా చేసినా... చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:ఆటో నెంబర్ కారుకు అతికించారు.. పోలీసులు గుర్తు పట్టేశారు!