తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కలుషిత ఆహారం తిని 15మంది విద్యార్థులకు అస్వస్థత - మధ్యాహ్న భోజనం

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన.. సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

15 students sick after eating contaminated food in sangareddy
కలుషిత ఆహారం తిని 15మంది విద్యార్థులకు అస్వస్థత

By

Published : Feb 5, 2021, 10:20 PM IST

కలుషిత ఆహారం తిని 15మంది విద్యార్థులతో పాటు నలుగురు ఉపాధ్యాయులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.

పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న అనంతరం.. బాధితులు వాంతులు చేసుకొని తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తోటి ఉపాధ్యాయులు వివరించారు. చికిత్స నిమిత్తం.. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:పిల్లలను ఇనుప రాడ్డుతో కొట్టి ఆపై ఆత్మహత్య!

ABOUT THE AUTHOR

...view details