నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని మంథన్ గోడ్, బుత్పూరు శివారులో కోడి పందేలు కాస్తున్న 15 మంది అరెస్టయ్యారు. ఆ గ్రామల మధ్యలో గల అడవిలో కోడి పందేలు ఆడుతున్నట్లు సమాచారం అందుకున్న మక్తల్ పోలీసులు దాడులు నిర్వహించారు.
అడవిలో కోడి పందేలు.. 15 మంది అరెస్టు - మంథన్ గోడ్ శివారులో కోడి పందేలు
సంక్రాంతి పండుగ వచ్చింది.. ఊరికి దూరంగా ఉన్న ప్రాంతం.. కార్లు, బైక్‌లతో పలువురు బయలుదేరారు. సంచుల్లో ఉన్న కోళ్లను పందేల కోసం సిద్ధం చేశారు. బయటకి తీసి పందేలు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించి 15 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటన నారాయణ పేట జిల్లాలో జరిగింది.
అడవిలో కోడి పందేలు.. 15 మంది అరెస్టు
15 మంది పందేం రాయుళ్లు, 17 సెల్ఫోన్లు, 4 కోళ్లు, 6 బైక్‌లు, ఓ కారు, 4,240 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు మక్తల్ ఎస్సై రాములు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి :కోడి పందేల్లో యువకుల వివాదం