సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న నగదును హైదరాబాద్ మధ్యమండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అనుమానితుని నుంచి రూ.14.96 లక్షలు, ఓ ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌కు చెందిన డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి మెదక్ జిల్లా చేగుంటలో ఇల్లు నిర్మాణాన్ని చేపట్టారు. వారం రోజులుగా అక్కడి పనివారికి డబ్బు ఇవ్వలేదు.
సరైనపత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.15 లక్షలు స్వాధీనం
సరైన పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న డబ్బును హైదరాబాద్ బంజారాహిల్స్‌లో పోలీసులు పట్టుకున్నారు. అనుమానితుని నుంచి రూ.14.96 లక్షలు, ఓ ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. దొరికిన నగదు హవాల డబ్బు కాదని పోలీసులు స్పష్టం చేశారు.
సరైనపత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.15 లక్షలు స్వాధీనం
తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ.14లక్షల 80 వేలు డ్రా చేసి బంజారాహిల్స్ నుంచి హైదర్గూడా వైపు వెళ్తుండగా.. టాస్క్ఫోర్క్ పోలీసులు కారును అడ్డుకున్నారు. కారును తనిఖీ చేయగా... 14 లక్షల 96 వేలు దొరికాయి. డబ్బుకు సరైన పత్రాలు లేని కారణంగా శ్రవణ్ కుమార్ రెడ్డిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత నగదును పోలీసులు ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు. దొరికిన నగదు హవాల డబ్బు కాదని పోలీసులు స్పష్టం చేశారు.