ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ సమీపంలోని పవర్ హౌస్ బ్రిడ్జి వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు, డీసీఎం వేగంగా ఢీకొనడం వల్ల 14 మందికి గాయాలయ్యాయి. అందులో డీసీఎం డ్రైవర్‌తో సహా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఎదురురెదురుగా వెళ్తున్న ఈ రెండు వాహనాలు ఢీకొనడం వల్ల డీసీఎం క్యాబిన్ ధ్వంసమైంది.
ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీ... 14 మందికి గాయాలు - 14 injured after RTC bus rams into DCM truck in Khammam
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళ్తున్న బస్సు, డీసీఎం ఢీకొన్న ఘటనలో 14 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
ఆర్టీసీ బస్సు, డీసీఎం ఢీ... 14 మందికి గాయాలు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం వల్ల రోడ్డుకు ఇరువైపుల భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో రోడ్డుపై అడ్డంగా ఉన్న డీసీఎం, బస్సును తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: గ్యాస్‌సిలిండర్ పేలి మూడు ఇళ్లు ధ్వంసం