నల్గొండ జిల్లా తిరుమల గిరి మండలం కోంపెల్లిలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. గొర్రెల కాపరి కొప్పరి నర్సింహకు చెందిన 14 గొర్రె, మేక పిల్లలను వీధి కుక్కలు గాయపరచి చంపేశాయి. తన గొర్రె, మేక పిల్లలు చనిపోవడం వల్ల బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు.
వీధి కుక్కల స్వైర విహారం.. 14 గొర్రె, మేక పిల్లలు బలి - వీధి కుక్కల దాడి వార్తలు నల్గొండ జిల్లా
గ్రామాల్లో కుక్కల బెడద తప్పడం లేదు. సుమారు అన్ని గ్రామాల్లో ఉన్న సమస్య ఇది. గ్రామ పంచాయతీల్లో కుక్కలను చంపడం మానేశారు. దీంతో గ్రామాల్లో గొర్రెలు, మేకలు, చివరకు మనుషులను కూడా గాయపరుస్తున్న ఘటనలు ఉన్నాయి. అలాంటి ఘటనే నల్గొండ జిల్లా తిరుమల గిరి మండలం కోంపెల్లిలో చోటుచేసుకుంది.
వీధి కుక్కల స్వైర విహారం.. 14 గొర్రె, మేక పిల్లలు బలి
గ్రామాల్లో ఇలాంటి ఘటనలు జరిగినా.. పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఉపయోగం లేకుండా పోయిందని గ్రామస్థులు వాపోయారు. వీధికుక్కల నియంత్రణ కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:రోడ్డు పక్కనే ద్విచక్రవాహనం... ఇద్దరు యువకుల దుర్మరణం