భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మద్యం మత్తులో ముగ్గురు యువకులు హల్చల్ చేశారు. పట్టణంలోని పలు చోట్ల 13 కార్ల అద్దాలను పగులగొట్టారు. సింగరేణి నిర్వాసితుల కాలనీ, పట్టణంలో జరిగిన ఈ ఘటనను ఉదయం సమయంలో పారిశుద్ధ్య కార్మికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మద్యం మత్తులో యువకుల హల్చల్.. 13 కార్ల అద్దాలు ధ్వంసం - భద్రాద్రి జిల్లా నేర వార్తలు
మద్యం మత్తులో ముగ్గులు యువకులు పలు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో యువకుల హల్చల్.. 13 కార్ల అద్దాలు ధ్వంసం
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్ తెలిపారు.
ఇదీ చదవండి:కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కరోనా.. సెల్ఫ్ ఐసోలేషన్లో ఎంపీ