తల్లి మందలించదని మనస్తాపం చెంది 12 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పట్టణంలో బీసీ కాలనీలో చోటు చేసుకుంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో నీరు ప్రవహించే ప్రాంతాలకు వెళ్లొద్దని బాలిక నసిబాను.. తల్లి మెహరిన్ మందలించింది. దీంతో మనస్తాపం చెందిన బాలిక చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. విషయాన్ని గమనించిన తల్లి, స్థానికుల సహాయంతో తలుపు బద్దలు కొట్టి.. బాలికను కిందకు దింపారు. వైద్యం కోసం ఆటోలో ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తల్లి మందలించిందని ఉరేసుకున్న బాలిక - girl suicide at nellore district news update
ఏపీ నెల్లూరు జిల్లాలోని బీసీ కాలనీలో బాలిక ఆత్మహత్యతో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి మందలించిందని మనస్తాపం చెందిన బాలిక ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
తల్లి మందలించిందని ఉరేసుకున్న బాలిక
అప్పటి వరకూ ఆడుతూ పాడుతూ స్థానికులకు కనిపించిన బాలిక మృతిచెందటం కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. బాలిక తండ్రి నాయబ్ రసూల్ జీవనోపాధి కోసం సౌదీ అరేబియాలో ఉండటం.. కుటుంబ సభ్యులు ఆయనకు సమాచారం అందించారు.
ఇదీ చూడండి: తెలంగాణ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి
Last Updated : Dec 8, 2020, 3:32 PM IST