తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పెళ్లి బృందంతో వెళ్తున్న ఆటో బోల్తా.. 12 మందికి గాయాలు - మూలస్తంభం తండా తాజా వార్తలు

పెళ్లి బృందంతో వెళుతున్న ఆటో బోల్తాపడిన ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్.. క్షతగాత్రులను 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తన మానవత్వం చాటుకున్నారు.

12 people were injured when an auto overturned while traveling to marriage at mulasthambham thanda in mahabubabad
పెళ్లి బృందంతో వెళ్తున్న ఆటో బోల్తా.. 12 మందికి గాయాలు

By

Published : Jan 10, 2021, 2:41 PM IST

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మూలస్తంభం తండా వద్ద పెళ్లి బృందంతో వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. కోమటిపల్లి క్రాస్‌ రోడ్డు వద్ద వాహనం అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్.. వాహనం బోల్తా పడి ఉండటాన్ని చూసి క్షతగాత్రులను 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తన మానవత్వం చాటుకున్నారు.

కేసముద్రం మండలం కల్వల గ్రామం నుంచి ఇనుగుర్తి గ్రామంలో జరుగుతున్ పెళ్లికి 20 మంది బంధు, మిత్రులతో ఆటోలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం లేదని.. స్వల్ప గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి: లైవ్​ వీడియో: ట్రాక్టర్​ను ఢీకొన్న లారీ

ABOUT THE AUTHOR

...view details