యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజీపురంలో తప్పిపోయి బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్న బాలుడిని పోలీసులు అక్కున చేర్చుకున్నారు. గ్రామములో బాలుడు తిరుగుతుండగా... స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు... అబ్బాయిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తప్పిపోయి వచ్చిన బాలున్ని చేరదీసిన పోలీసులు
సుమారు 11 ఏళ్లున్న బాలుడు భువనగిరి మండలం అనాజీపురంలో తిరుగుతుండగా... స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు బాలున్ని చేరదీశారు. వివరాలు సేకరించి... తన తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్పటి వరకు రాయగిరిలోని ఓ ఆశ్రమంలో చేర్పించారు.
11 years boy appear in bhuvanagiri mandal anajipuram
తన పేరు శివ అనీ... తమది గుంటూరు అని మాత్రమే బాలుడు చెబుతున్నాడు. మిగతా విషయాలు చెప్పటంలేదు. అబ్బాయికి సుమారు 11 ఏళ్ల వయసు ఉంటుందని పోలీసులు వివరించారు. బాలున్ని ప్రస్తుతం రాయగిరిలోని సహృదయ ఆశ్రమానికి తరలించామని భువనగిరి రూరల్ ఎస్సై రాఘవేందర్ గౌడ్ తెలిపారు.
బాలుడి వివరాలు తెలిసిన వారు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ని సంప్రదించగలరని కోరారు. గుంటూరు పోలీసులకు బాలుని సమాచారం అందించినట్లు ఎస్సై రాఘవేందర్ వెల్లడించారు.