మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి శివారు బోడగుట్ట తండాలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. నిందితుడుని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
100 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్.. ఒకరు అరెస్ట్ - ration rice seized in mahabubabad district
ప్రజలకు పంపిణీ చేయకుండా నిల్వ చేసిన సుమారు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
100 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్.. ఒకరు అరెస్ట్
బోడగుట్ట తండాకు చెందిన రేషన్ డీలర్ బానోతు ధల్సింగ్ బియ్యాన్ని పంపిణీ చేయకుండా పక్కదారి పట్టిస్తున్నాడని ఎస్పీ తెలిపారు. సుమారు 100 క్వింటాళ్ల బియ్యాన్ని నిల్వ చేసి విక్రయించేందుకు సిద్ధం చేశాడనే సమాచారంతో దాడులు చేశామన్నారు. రేషన్ బియ్యం పట్టుకునేందుకు కృషిచేసిన పోలీసులకు రివార్డులు అందించి అభినందించారు.
ఇవీచూడండి:పాతబస్తీలో సోదాలు.. 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం