మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల శివారులో వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 100 బస్తాల నల్ల బెల్లం, పది బస్తాల పటికను ఎక్సైజ్ సిబ్బంది సీజ్ చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అక్రమంగా తరలిస్తున్న 100 బస్తాల బెల్లం, పటిక సీజ్ - mahabubabad latest news
అక్రమంగా తరలిస్తున్న 100 బస్తాల నల్ల బెల్లం, పది బస్తాల పటికను ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. రాజమండ్రిలో తక్కువ ధరకు కొని మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
కురవి మండలానికి చెందిన భానోత్ రవీందర్, గుగులోత్ నాగేశ్వర రావు, రంగారెడ్డి జిల్లా చంపాపేటకు చెందిన అల్మాల్ రెడ్డి అనే వ్యక్తులు ముఠాగా ఏర్పడ్డారు. రాజమండ్రిలో తక్కువ ధరకు నల్ల బెల్లం, పటికను కొనుగోలు చేసి మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. బెల్లం తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎక్సైజ్ డీటీఎఫ్ స్కాడ్ సీఐ కృష్ణ తన సిబ్బందితో మాటు వేసి బెల్లం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు.
ఇదీ చూడండి:ఆస్తుల కోసం మమ్మల్ని ఇంతలా వేధిస్తారా? : భూమా మౌనిక