కర్ణాటకలోని తూమ్‌కుర్ నుంచి ఆదిలాబాద్‌కు నిషేధిత గుట్కాను వ్యాన్‌లో తరలిస్తుండగా నిర్మల్ మండలంలోని కొండాపూర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీలు చేస్తుండగా... ఓ వ్యానుపై అనుమానం రావటం వల్ల పోలీసులు సోదా చేశారు. వ్యానులో 100 గుట్కా సంచులు బయటపడ్డాయి.
100 సంచుల గుట్కా స్వాధీనం... ఒకరు అరెస్ట్ - crime news
నిర్మల్ జిల్లాలోని కొండాపూర్ వద్ద ఓ వ్యానులో 100 సంచుల గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక నుంచి ఆదిలాబాద్‌కు తరలిస్తున్న క్రమంలో... పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా సరకు బయటపడింది. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
100 bags of gutka caught by police at kondapur
సరకును ఆదిలాబాద్‌లోని అస్లాం జనరల్ స్టోర్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుట్కా విలువ రూ.11.92 లక్షలు ఉంటుందని, తరలిస్తున్న నిందితుడు ముజాహిద్ పాషాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.