హైదరాబాద్ చాంద్రయణగుట్ట పరిధిలోని పటేల్‌నగర్‌లో చిట్టీల పేరుతో భారీ మోసం జరిగింది. సుమారు వంద మంది దగ్గరి నుంచి వసూలు చేసిన రూ. 10 కోట్లతో చిట్ ఫండ్ యజమాని అంజలి పరారైంది. విషయం తెలుసుకున్న బాధితులు మొదటగా చాంద్రయణగుట్ట పోలీసులను బాధితులు ఆశ్రయించారు. కేసు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు చాంద్రయణగుట్ట గుట్ట పోలీసులు బదిలీ చేయగా... బాధితులు సీసీస్లో ఫిర్యాదు చేశారు.
చిట్టీల పేరుతో వంద మందికి రూ.10 కోట్ల కుచ్చుటోపీ - రూ.10 కోట్లతో చిట్‌ఫండ్ వ్యాపారి పరారీ
చిట్టీల పేరుతో ఓ మహిళ వంద మందికి కుచ్చుటోపీ పెట్టింది. రూ.10 కోట్లతో పరారైంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని పటేల్‌నగర్‌లో జరిగింది. ఆడపిల్లల పెళ్లిల్ల కోసం కష్టపడి దాచుకున్నామని.. ఎలాగైనా నిందితురాలిని పట్టుకుని తమకు డబ్బు ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.
![చిట్టీల పేరుతో వంద మందికి రూ.10 కోట్ల కుచ్చుటోపీ 10 crore worth chit fund fraud in patel nagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9844353-554-9844353-1607693557550.jpg)
10 crore worth chit fund fraud in patel nagar
సీఆర్పీఎఫ్ విశ్రాంత ఉద్యోగి బాబూరావు సతీమణి అంజలి... ఇరవై ఏళ్లుగా పటేల్ నగర్లో నివాసం ఉంటుంది. చాలా రోజుల నుంచి నమ్మకంతో చిట్టి వ్యాపారం చేస్తోందని... అందుకే ఆమె వద్ద చిట్టీలు వేసినట్లు బాధితులు తెలిపారు. ఒక్కో రూపాయి జమచేసి ఆడపిల్లల పెళ్లిల్ల కోసం పది లక్షల రూపాయల చిట్టి వేశామని... సమయానికి డబ్బు కావాలని అడిగే సరికి దుకాణం ఎత్తేసిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మోసం చేసిన మహిళను అదుపులోకి తీసుకొని తమ డబ్బులు తమకు ఇప్పించాలని పోలీసులను వేడుకున్నారు.