తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'కాంగ్రెస్‌లోనే ఉంటానని నా తండ్రిపై ప్రమాణం చేశాను' - social media fake news

సిద్దిపేట జిల్లా తొగుట పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. సోషల్​మీడియాలో తనపై తెరాస, భాజపా అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. తాను తెరాసలో ఎట్టి పరిస్థితిలో చేరేది లేదని... కాంగ్రెస్​లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.

'కాంగ్రెస్‌లోనే ఉంటానని నా తండ్రిపై ప్రమాణం చేశాను'
'కాంగ్రెస్‌లోనే ఉంటానని నా తండ్రిపై ప్రమాణం చేశాను'

By

Published : Nov 3, 2020, 9:59 AM IST

Updated : Nov 3, 2020, 11:39 AM IST

'కాంగ్రెస్‌లోనే ఉంటానని నా తండ్రిపై ప్రమాణం చేశాను'

సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ప్రచారం చేస్తున్నారని సిద్దిపేట జిల్లా తొగుట పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. తాను తెరాసలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తాను హైదరాబాద్‌లో ఉన్నట్లు కారును చూపిస్తూ నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

తనపై దుష్ప్రచారం చేయడం సిగ్గుమాలిన, దుర్మార్గమైన చర్యఅని శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని తన తండ్రిపై ప్రమాణం చేసినట్లు పేర్కొన్నారు. భాజపా, తెరాసలు కావాలనే తనపై ఇలాంటి అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

ఇదీ చూడండి: చిట్టాపూర్​లో సుజాత.. బొప్పాపూర్​లో రఘునందన్​రావు

Last Updated : Nov 3, 2020, 11:39 AM IST

ABOUT THE AUTHOR

...view details