తెలంగాణ

telangana

By

Published : Feb 10, 2021, 5:42 PM IST

Updated : Feb 10, 2021, 7:17 PM IST

ETV Bharat / international

సౌదీ ఎయిర్​పోర్ట్​పై దాడి- ఓ విమానానికి మంటలు

Yemeni rebel attack targeting Abha airport
సౌదీ ఎయిర్​పోర్ట్​పై దాడి- ఓ విమానానికి మంటలు

17:34 February 10

సౌదీ ఎయిర్​పోర్ట్​పై దాడి- ఓ విమానానికి మంటలు

సౌదీ అరేబియాలో యెమెన్ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. అభా ఎయిర్​పోర్ట్ లక్ష్యంగా చేసిన ఈ దాడిలో ఓ పౌర విమానానికి మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేశాయని స్థానిక వార్తా సంస్థ తెలిపింది. ఈ ఘటనలో ఎంతమంది మరణించి ఉంటారనే విషయంపై స్పష్టత రాలేదని పేర్కొంది. దాడి సమయంలో ఎయిర్​పోర్ట్​లో రెండు విమానా​లు ఉన్నట్లు తెలుస్తోంది.

హౌతీ తిరుగుబాటుదారులే ఈ దాడికి పాల్పడ్డారని సౌదీ అరేబియా సైనిక అధికారి కర్నల్ తుర్కి అల్ మలికీ తెలిపారు. బాంబులతో కూడిన డ్రోన్లను ప్రయోగించేందుకు యత్నించారని చెప్పారు. అయితే వీటిని భద్రతా దళాలు అడ్డుకొని నాశనం చేశాయని చెప్పారు. స్థానిక పౌరుల లక్ష్యంగా పగడ్బందీ ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని అన్నారు.

కఠిన చర్యలు తప్పవు

యెమెన్​లోని హౌతీ తీవ్రవాదులకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా యుద్ధంలో పాల్గొంటోంది. ఈ సైనిక చర్య వల్ల ప్రపంచంలో అత్యంత తీవ్రమైన మానవతా సంక్షోభం ఏర్పడింది. అయితే తాజా దాడిపై హౌతీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

మరోవైపు, ఈ ఘటనకు కారకులైనవారిని బాధ్యులను చేస్తామని యెమెన్​లో పోరాటం సాగిస్తున్న సౌదీ సైనిక కూటమి తెలిపింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా బాధ్యులైన ఉగ్ర సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

Last Updated : Feb 10, 2021, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details