తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గుడ్డు.. ఏ జీవిది?

అంటార్కటికాలో ఫుట్​బాల్​ సైజులో ఉన్న ఓ గుడ్డు పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడింది. ఈ గుడ్డు ఇప్పుడు ప్రపంచంలోనే భారీ గుడ్లలో రెండో అతిపెద్దది. దీని వయసు సుమారు 6800 ఏళ్లు ఉండొచ్చని అంచనా వేశారు శాస్త్రవేత్తలు. ఇంతకీ అంతటి భారీ అండం ఏ జీవి పెట్టి ఉంటుంది?

By

Published : Jun 19, 2020, 2:49 PM IST

Updated : Jun 19, 2020, 5:25 PM IST

world's second-biggest egg
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గుడ్డు.. ఏ జీవిది?

దాదాపు 6800 ఏళ్ల క్రితం నాటి ఓ భారీ గుడ్డు శిలాజం అంటార్కటికా సేమాల్​ ద్వీపంలో లభ్యమైంది. గాలి తీసేసిన ఫుట్​బాల్​ ఆకారంలో ఉన్న ఈ గుడ్డు.. డైనోసార్ల కాలానికి చెందిన సముద్ర సరీసృపాల అండంగా భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. అందుకే ఇదిప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పురాతన గుడ్డుగా పేరు సంపాదించుకుంది.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గుడ్డు.. ఏ జీవి పెట్టింది?

ఇప్పటి వరకు దొరికిన పక్షులు, మొసళ్లు, అనేక డైనోసార్‌లు ధృడమైన పైకప్పున్న గుడ్లను పెట్టినట్టు ఆధారాలున్నాయి. కానీ, అంటార్కిటికాలో దొరికిన ఈ గుడ్డు మాత్రం మృదువైన పెంకును కలిగి ఉంది. దాదాపు 28x18 సెం.మీ పరిమాణంలో ఉంది. దీంతో మోసాసార్​.. లేదా పొడవాటి మెడ గల ప్లీసియోసార్‌ల జాతికి చెందిన సముద్ర జీవి ఏదైనా ఈ గుడ్డును పెట్టి ఉంటుందని పురావస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

"ఈ గుడ్డు చూడటానికి ఫుట్‌బాల్​లాగా కనిపిస్తోంది. కుంగిన దాని ఉపరితలంపై అనేక ముడతలు ఉన్నాయి. ఈ గుడ్డు సముద్రపు అడుగు భాగంలో కదలకుండా ఉండటం వల్లే ఒక వైపు చదును చేసినట్టుగా ఉన్న దాని ఆకారం ఉంది. బల్లి, పాముల గుడ్ల మాదిరిగానే దీని పైకప్పు కూడా చాలా సన్నగా ఉంది."

-లూకస్​ లెజెండ్రే, శిలాజ నిపుణుడు, టెక్సాస్​ వర్సిటీ.

గుడ్డులో పిండ అవశేషాలు లేవు, దానికి జన్మనిచ్చిన జంతువు అస్థిపంజరం ఆ దరిదాపుల్లో దొరకలేదు. దీంతో ఈ భారీ గుడ్డు ఏ జీవి పెట్టిందోనని లోతైన పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

ఇదీ చదవండి:శునకంతో.. పులిబిడ్డకు దోస్తీ కుదిరింది!

Last Updated : Jun 19, 2020, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details