తెలంగాణ

telangana

ETV Bharat / international

టర్కీలో కార్చిచ్చు విధ్వంసం- ముగ్గురు సజీవదహనం

టర్కీలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న దావానలం ధాటికి ముగ్గురు సజీవ దహనమయ్యారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మర్మరిస్​, అంటల్యా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. టర్కీ కార్చిచ్చు ఉగ్రరూపం ఫొటోల్లో చూడండి.

Wildfires in southern Turkey leave 3 dead, manyhospitalized
టర్కీలో కార్చిచ్చు విధ్వంసం

By

Published : Jul 30, 2021, 1:08 PM IST

దక్షిణ టర్కీలో పలు చోట్ల చెలరేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. మర్మరిస్, అంటల్యా, బొడ్రం ప్రాంతాల్లో వందలాది ఇళ్లు, ఆస్తులు కాలి బూడిదయ్యాయి. అంటల్యాలోని మధ్యదరా సముద్ర తీర ప్రాంతం మనవ్​గట్​లో మంటల్లో చిక్కుకుని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో జనం తీవ్రంగా గాయపడ్డారు. కార్చిచ్చు ఉద్ధృతంగా వ్యాపిస్తున్నందున సమీప ప్రాంత ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు. గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్నారు.

కార్చిచ్చు విధ్వంసం దాటికి అంటల్యా మనవ్​గట్​లోని చాలా గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయి.

కాలిబూడిదైన గ్రామం
కార్చిచ్చు ధాటికి కాలి బూడిదైన గ్రామం

మర్మరిస్​లోని ఓ పర్యటక హోటల్​కు సమీపంలో మంటలు చెలరేగాయి. పర్యటకులంతా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

కార్చిచ్చు విధ్వంసం
పర్యటక హోటల్​కు సమీపంలో కార్చిచ్చు పొగలు
శునకాన్నికాపాడుకుంటున్న వ్యక్తి
కార్చిచ్ఛు ఉగ్రరూపాన్ని చూస్తున్న పోలీసులు
పర్యటకురాలికి వైద్య సాయం అందిస్తున్న సిబ్బంది
బీచ్ సమీపంలో చెలరేగిన మంటలు

ABOUT THE AUTHOR

...view details