పశ్చిమాసియా దేశాల్లో కరోనా 2.0పై తీవ్ర హెచ్చరికలు జారీచేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ). శీతాకాలంలో వైరస్ వ్యాప్తి మరింత అధికమయ్యే ప్రమాదముందని డబ్ల్యూహెచ్ఓ పశ్చిమాసియా రీజనల్ డైరక్టర్ అహ్మద్ అల్మంధారి అన్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ మార్గదర్శకాలను మరింత కఠినతరం చేయాలని సూచించారు.
ప్రపంచదేశాలతో పోలిస్తే పశ్చిమాసియా దేశాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందన్నారు అహ్మద్. ఈ ఏడాది ఆరంభంలో కఠిన లాక్డౌన్ అనంతరం భద్రతా చర్యలు క్రమంగా తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేసారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం వంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించడంతోనే కొవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చని పునరుద్ఘాటించారు.