తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాకు తలొగ్గే ప్రసక్తే లేదు: హసన్ రౌహానీ - అమెరికాపై హసన్ రౌహానీ స్పందన

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసేలా ఇరాన్ అధ్యక్షుడు హసన్​ రౌహానీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అమెరికా తెలివైన దేశం అయితే మరోసారికి దాడికి ప్రయత్నించదని వ్యాఖ్యానించారు.

'We don't retreat in face of America': Iran president
అమెరికాకు తలొగ్గే ప్రసక్తే లేదు: హసన్ రౌహానీ

By

Published : Jan 8, 2020, 11:06 PM IST

అమెరికా-ఇరాన్​ల మధ్య ఉద్రిక్తతలు ఇటీవల తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. అమెరికా సైనిక స్థావరాలపై వరుస క్షిపణి దాడులతో విరుచుపడ్డ అనంతరం ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ముందు ఎంతమాత్రం తగ్గేది లేదని విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా దాడులకు పాల్పడితే.. ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

"అమెరికా ముందు ఎంతమాత్రం తగ్గేది లేదు. ఒకవేళ అమెరికా దాడులు చేస్తే.. తగిన ప్రతిస్పందన ఇస్తామన్న విషయం వారికి తెలియాలి. వారు తెలివైన వారైతే ఈ పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోరు. నా దృష్టిలో... ఈ ప్రాంతంలోని దేశాల నుంచి అమెరికాకు సరైన సమాధానం ఇవ్వాల్సి ఉంది. వారు సులేమానీని హతమార్చారు. ఇందుకు ప్రతీకారం అమెరికాను ఈ ప్రాంతం నుంచి లేకుండా చేయడమే. ఇరాన్​ నుంచి నిజమైన, చివరి ప్రతిస్పందన ఇదే అవుతుంది."
-హసన్ రౌహానీ, ఇరాన్ అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details