తెలంగాణ

telangana

సౌదీ అరేబియాకు అమెరికా 'రక్ష'ణ సాయం

తమ దేశానికి చెందిన 200 దళాలను సౌదీలో మోహరించనున్నట్టు అమెరికా ప్రకటించింది. సౌదీ చమురు కర్మాగారాలపై దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది.

By

Published : Sep 27, 2019, 8:04 AM IST

Published : Sep 27, 2019, 8:04 AM IST

Updated : Oct 2, 2019, 4:30 AM IST

సౌదీ అరేబియాకు అమెరికా 'రక్ష'ణ సాయం

ఆగస్టులో సౌదీ చమురు కేంద్రాలపై దాడి జరిగిన నేపథ్యంలో ఆ దేశ భద్రతా రంగాన్ని బలోపేతం చేయడానికి అమెరికా సహాయం చేయనుంది. ఈ మేరకు తమ దేశానికి చెందిన 200 దళాలను సౌదీలో మోహరించనున్నట్టు అగ్రరాజ్య రక్షణశాఖ ప్రకటించింది.

దళాలతో పాటు భూతలం మీద నుంచి ఆకాశంవైపు ప్రయోగించగలిగే పాట్రియాట్ క్షిపణులను సౌదీకి పంపనుంది అమెరికా. వీటిలో ఓ బ్యాటరీ సహా నాలుగు సెంటినల్​ రాడార్ల వ్యవస్థ ఉంటుంది.

వీటితోపాటు అవసరమైతే మరో రెండు పాట్రియాట్​ బ్యాటరీలు, ఒక థాడ్​(టీహెచ్​ఏఏడీ) బాలిస్టిక్​ క్షిపణి వ్యవస్థనుపంపడానికి సిద్ధం చేస్తున్నట్టు పెంటగాన్​ ప్రతినిధి జొనాథన్​ హఫ్​మన్​ తెలిపారు.

"సౌదీ అరేబియాపై దాడి జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రాంతీయ భాగస్వామ్యానికి, మధ్య ఆసియా దేశాల భద్రత, స్థిరత్వానికి అమెరికా కట్టుబడి ఉన్నట్టు ఈ చర్యలు స్పష్టం చేస్తాయి."
--- జొనాథన్​ హఫ్​మన్, పెంటగాన్​ ప్రతినిధి.

సౌదీ అరేబియా చమురు కేంద్రాలపై దాడి.. ఇరాన్​ పనేనని అమెరికా పలుమార్లు ఆరోపించింది. ఈ ఆరోపణలు నిరాధారమని ఇరాన్​ కొట్టిపారేసింది.

Last Updated : Oct 2, 2019, 4:30 AM IST

ABOUT THE AUTHOR

...view details