తెలంగాణ

telangana

ETV Bharat / international

సముద్ర గర్భంలో రయ్​రయ్- ఉబర్​ నూతన సేవలు - SCUBER

సముద్ర గర్భంలోకి వెళ్లి అద్భుత అనుభూతిని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది ఉబర్​ సంస్థ. ఆస్ట్రేలియా సముద్ర తీరంలోని క్వీన్స్​లాండ్​ పర్యటకశాఖతో సంయుక్తంగా ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా 'ట్యాక్సీ' జలాంతర్గామి సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 27 నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. వీటిని ఉబర్​ యాప్​ ద్వారా పొందవచ్చు.

సముద్ర గర్భంలో రయ్​రయ్- ఉబెర్​ నూతన సేవలు

By

Published : May 26, 2019, 11:52 AM IST

Updated : May 26, 2019, 3:29 PM IST

సముద్ర గర్భంలో రయ్​రయ్- ఉబర్​ నూతన సేవలు
సముద్రం అడుగుకు వెళ్లాలంటే ప్రత్యేక సూటు, ఆక్సిజన్​ మాస్క్​ ధరించాల్సిందే. ముఖ్యంగా ఎంతో ధైర్యం, ప్రత్యేక శిక్షణ అవసరం. సామాన్యులకు అంత సులభం కాదు. సముద్రపు అడుగులో సాహస యాత్ర చేయాలనుకునే వారికోసం ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా 'ట్యాక్సీ' జలాంతర్గామి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది ఉబర్​ సంస్థ.

ఆస్ట్రేలియాలోని అద్భుతమైన పగడాల దీవిలో క్వీన్స్​ల్యాండ్​ పర్యటక శాఖతో కలిసి సంయుక్తంగా "ఎస్​సీ ఉబర్​" పేరిట.. జలాంతర్గామి సేవలను ప్రవేశపెట్టింది. ఈ జలాంతర్గామిలో ప్రయాణించే వారు సముద్ర లోపల 180 డిగ్రీలతో అందాలను వీక్షించొచ్చు. ఎలాంటి మాస్క్​ ధరించకుండానే సుమారు 30 మీటర్ల లోతువరకు చేరుకోవచ్చు.

ధర ఇదే..

ఉబర్​ యాప్​ ద్వారా ఈ సబ్​మెరైన్​ సేవలను పొందవచ్చు. ఇందు కోసం ఇద్దరు ప్రయాణికులు 3 వేల ఆస్ట్రేలియన్​ డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది.

27న ప్రారంభం

క్వీన్స్​ల్యాండ్​ గోల్డ్​స్టోన్​ తీరంలోని హెరోన్​ ద్వీపంలో రేపు(మే 27న) ఈ సేవలను ప్రారంభించనుంది ఉబర్​ సంస్థ. జూన్​ 18 వరకు ఉత్తర క్వీన్స్​లాండ్​ పోర్ట్​ డగ్లస్​లోని అగిన్​కోర్ట్​ పగడాల దీవిలో ఈ సేవలను అందించాలని ప్రణాళిక వేసుకుంది.

ఇదీ చూడండి:కారుపై 'పేడ కోటింగ్​'... చల్లటి ఐడియా​ గురూ!

Last Updated : May 26, 2019, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details