తెలంగాణ

telangana

By

Published : Dec 9, 2020, 3:52 PM IST

ETV Bharat / international

'చైనా టీకా 86% సమర్థవంతం'

చైనా సంస్థ సినోఫార్మ్ తయారుచేసిన కరోనా టీకా 86 శాతం సమర్థతతో పనిచేస్తున్నట్లు యూఏఈ తెలిపింది. టీకా ట్రయల్స్​ మధ్యంతర ఫలితాలను విశ్లేషించినట్లు వెల్లడించింది.

UAE says Chinese vaccine 86% effective, offers few details
చైనా టీకా 86 శాతం సమర్థవంతం: యూఏఈ

కరోనా నివారణకు చైనా సంస్థ సినోఫార్మ్ తయారుచేసిన టీకా 86 శాతం సమర్థంగా పనిచేస్తోందని యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్​ ప్రకటించింది. సినోఫార్మ్ సీఎన్​బీజీ టీకా ఫేజ్​ 3 మధ్యంతర ఫలితాలను పూర్తిగా విశ్లేషించినట్లు యూఏఈ వైద్య శాఖ తెలిపింది. టీకా వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావాలు తలెత్తలేదని వెల్లడించింది.

అయితే యూఏఈ చేసిన ప్రకటన అసంపూర్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. యూఏఈలో జరిగిన ట్రయల్స్​లో పాల్గొన్నవారి సమాచారాన్నే విశ్లేషించారా లేదా... చైనా, ఇతర ప్రాంతాల్లో జరిగిన ప్రయోగాలను పరిగణనలోకి తీసుకున్నారా అనే వివరాలను వైద్యశాఖ పొందుపరచలేదు. టీకా సురక్షితంగానే ఉందని ప్రకటించినప్పటికీ.. ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్​ తలెత్తాయా అనే విషయాలు వెల్లడించలేదు. టీకా.. అధికారిక రిజిస్ట్రేషన్ పొందిందని నివేదికలో చెప్పినప్పటికీ.. ఏ ప్రాతిపదికన అనుమతి ఇచ్చారో స్పష్టం చేయలేదు. ఈ విషయంపై సినోఫార్మ్, ఎమిరేట్స్ అధికారులు ఎలాంటి స్పందన తెలియజేయలేదు.

ఈ టీకాను దుబాయి పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ సహా యూఏఈకి చెందిన ఉన్నతాధికారులు బహిరంగంగా స్వీకరించారు.

పూర్తిగా అన్​లాక్

మరోవైపు, రెండు వారాల్లో అన్ని ఆర్థిక, పర్యటక, సాంస్కృతిక, వినోద కార్యకలాపాలను పునరుద్ధరించనున్నట్లు అబుదాబి ప్రకటించింది. కరోనా పోరులో విజయం సాధించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details