తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా టీకా వేయించుకున్న యూఏఈ ప్రధాని - UAE covid vaccine

యూఏఈ ప్రధాని షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషిద్‌ అల్‌ మాక్తొమ్‌ మంగళవారం కొవిడ్​ టీకా వేయించుకున్నారు. వాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు రాత్రింబవళ్లు శ్రమించిన వైద్య బృందం పట్ల గర్వంగా ఉందని ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు ప్రధాని.

UAE-PM-sheikh-mohammed-bin-receives-COVID-19-vaccine
కరోనా టీకా వేయించుకున్న యూఏఈ ప్రధాని

By

Published : Nov 3, 2020, 7:54 PM IST

యూఏఈ ప్రధాని ప్రధాని మంగళవారం కొవిడ్​ టీకాను వేయించుకున్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని ట్విట్టర్​లో తెలిపారు. యూఏఈలో మంచిరోజులు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాక్సిన్‌ వేయించుకుంటున్న ఫొటోను ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.

కరోనా రోగులతో కాంటాక్ట్‌ అయిన ఆరోగ్య కార్యకర్తలకు అత్యవసర సమయంలో కరోనా టీకా ఇచ్చేందుకు యూఏఈ ప్రభుత్వం అనుమతించింది. టీకా లైసెన్స్‌ కోసం అవసరమైన చర్యలు చేపడుతోంది.

ABOUT THE AUTHOR

...view details