తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇజ్రాయెల్​పై​ బహిష్కరణ ఎత్తివేసిన యూఏఈ - యూఏఈ

ఇజ్రాయెల్​ను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని యూఏఈ రద్దు చేసుకుంది. ఈ మేరకు యూఏఈ పాలకుడు షేక్​ ఖలిఫా.. ఉత్తర్వులపై సంతకం చేశారు. ఇరు దేశాల మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందం నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.

UAE lifts ban on Israel after historic deal, business to start soon
ఇజ్రాయెల్​ బహిష్కరణ ఎత్తివేసిన యూఏఈ

By

Published : Aug 30, 2020, 5:41 AM IST

Updated : Aug 30, 2020, 11:43 AM IST

పశ్చిమాసియా రాజకీయాల్లో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్​తో దౌత్య సంబంధాలను ఏర్పరచుకుంటున్నట్టు యూఏఈ ప్రకటించింది. ఆ దేశాన్ని బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ.. యూఏఈ పాలకుడు షేక్​ ఖలిఫా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రెండు దేశాల మధ్య వర్తక వాణిజ్యాలు ప్రారంభం కానున్నాయి.

దాదాపు సంవత్సరం నుంచి అమెరికా చొరవతో ఇజ్రాయెల్​-యూఏఈ మధ్య చర్చలు జరుగుతున్నాయి. వెస్ట్​బ్యాంకులో పాలస్తీనా భూభాగాలను కలుపుకునే ప్రణాళికను ఆపేస్తామని ఇజ్రాయెల్​ ప్రకటించడం వల్ల ఈ నెల 13న ఈ రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణకు చారిత్రక ఒప్పందం కుదిరింది. అందుకు అనుగుణంగానే ఇజ్రాయెల్​ బహిష్కరణను ముగిస్తూ శనివారం షేక్​ ఖలీఫా డిక్రీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ఇజ్రాయెల్​ సంస్థలు.. యూఏఈ సంస్థలతో, వ్యక్తులతో లావాదేవీలు జరపవచ్చు.

విమాన ప్రయాణం...

రెండు దేశాల మధ్య విమానాల రాకపోకలు కూడా ప్రారంభంకానున్నాయి. సోమవారం టెల్​ అవీవ్​ నుంచి అబుదాబికి నేరుగా విమానం నడవనుంది. ఇందులో ఇజ్రాయెల్​ అధికారులతో పాటు.. అమెరికా అధికారులు, ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సలహాదారు, ఆయన అల్లుడు జేర్డ్​ కుష్నర్​ కూడా పయనించనున్నారు.

జోర్డాన్​, ఈజిప్ట్​ తర్వాత ఇజ్రాయెల్​తో దౌత్య సంబంధాలు పునరుద్ధరించుకున్న మూడో అరబ్​ దేశం యూఏఈ కావడం గమనార్హం.

ఇదీ చూడండి:-ఇజ్రాయెల్​-యూఏఈ డీల్​తో ఎవరికి లాభం?

Last Updated : Aug 30, 2020, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details