ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీ పేరుతో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై బెదిరింపులకు పాల్పడ్డ ట్విట్టర్ ఖాతాను ఆ సంస్థ తొలగించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ శుక్రవారం వెల్లడించింది. ఆ ఖాతాను శాశ్వతంగా రద్దు చేసిన సోషల్ మీడియా దిగ్గజం, అది నకిలీదని పేర్కొంది. ట్రంప్‌పై చేసిన పోస్ట్ తమ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేసింది.
ఆ పోస్ట్‌లో ఏముంది?
ఖొమైనీ పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతా ద్వారా దుండగులు గురువారం రోజు ట్రంప్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్‌పై యుద్ధ విమానం నీడ పడుతున్నట్లుగా ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ప్రతీకారం తీర్చుకోవడం ఖాయం అంటూ హెచ్చరించారు. ఈ చిత్రం ఖొమైనీ అధికారిక వెబ్సైట్లో కూడా ఉండటం గమనార్హం. నెల క్రితం జనరల్ సులేమానీ మృతిపట్ల ట్రంప్‌పై పరోక్షంగా ఖొమైనీ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు.
ఇదీ చదవండి :అమెరికా జాగ్రత్తగా ఉండాల్సిందే: ఇరాన్