4ఏళ్ల చిన్నారి.. 90గంటలు మృత్యువుతో పోరాటం టర్కీ రాజధాని ఇజ్మీర్ను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. నాలుగురోజులుగా శిథిలాల కింద చిక్కుకొని కొనఊపిరితో కొట్టుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి ఐడా గెజ్గిన్‌ను సహాయక సిబ్బంది గుర్తించింది. 90గంటలపాటు శ్రమించి శిథిలాల నుంచి బయటకు తీశారు. తరువాత ఐడాను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
బాధలోనూ సంతోషం
ఐడా సజీవంగా బయటపడటంతో రెస్క్యూ సిబ్బంది ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఈ ఘటనపై ఇజ్మీర్ మేయర్ టన్ సోయర్ ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. '91వ గంటలో అద్భుతం జరిగిందని తెలిపారు. ‘ఇంత బాధలోనూ చిన్నారి క్షేమంగా బయటకు రావడం మాకెంతో ఆనందాన్నిచ్చింది’' అని సోయర్ తెలిపారు.
భూకంపం కారణంగా టర్కీ వ్యాప్తంగా 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 7.0 తీవ్రతతో ప్రకంపనలు రావడంతో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.