తెలంగాణ

telangana

ETV Bharat / international

టర్కీ భూకంపంలో 24కు చేరిన మృతులు - Turkey earthquake death toll news

టర్కీలో భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 24కు పెరిగింది. 700మందికి పైగా గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Turkey: Search and rescue operation underway in Izmir city after an earthquake
టర్కీ భూకంపం: 17కు చేరిన మృతులు- 700మందికి గాయాలు

By

Published : Oct 31, 2020, 5:23 AM IST

Updated : Oct 31, 2020, 8:39 AM IST

టర్కీ మెట్రోపాలిటన్‌ నగరం ఇజ్మిర్‌లో భూకంపం కారణంగా భవనాలు కూలిన ఘటనలో మృతుల సంఖ్య 24కు చేరింది. 700 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. టర్కీ, గ్రీస్‌ దేశాల్లో భూకంపం కారణంగా సునామీ సంభవించింది.

యంత్రాలతో శిథిలాలు తొలగిస్తున్న అధికారులు
సహాయక చర్యలు కొనసాగిస్తున్న సిబ్బంది

ఏజియన్‌ సముద్రంలో రిక్టర్‌ స్కేలుపై 7 తీవ్రతతో ఈ భూంకంపం వచ్చినట్లు టర్కీ డిజాస్టర్‌ అండ్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. భూకంపం కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగింది. చిన్నపాటి సునామీతో సముద్రపు నీరు వీధుల్లోకి రావడం కనిపించింది. కొన్ని చోట్ల భవనాలు కుప్పకూలగా.. వాహనాలు ధ్వంసమయ్యాయి.

ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
భూకంపం కారణంగా కూలిన భవనం

ఇదీ చూడండి:టర్కీ, గ్రీస్‌లో భారీ భూకంపం.. 12 మంది మృతి

Last Updated : Oct 31, 2020, 8:39 AM IST

ABOUT THE AUTHOR

...view details