టర్కీ, గ్రీసుల్లో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 39కి చేరుకుంది. 800 మందికి పైగా గాయపడ్డారు. కుప్పకూలిన భవనాల కింద ఉండిపోయిన వారిని రక్షించేందుకు సహాయక కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం భూకంప తాకిడికి టర్కీలోని మూడో అతి పెద్ద నగరమైన ఇజ్మిర్‌లో పలు భారీ భవనాలు కుప్పకూలాయి. వరుస భూ ప్రకంపనలకు గ్రీకు ద్వీపమైన సామోస్‌లో చిన్నపాటి సునామీ ఏర్పడింది.
39కి చేరిన టర్కీ భూకంప మృతుల సంఖ్య - Turkey earthquake death toll news
టర్కీలో భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య 39కి పెరిగింది. 800మందికి పైగా గాయపడ్డారు. టర్కీ, గ్రీసుల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు అధికారులు.
ఇజ్మిర్‌లో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. కుప్పకూలిన ఎనిమిది అంతస్తుల భవనం నుంచి ఓ యువతిని, ఆమె కుక్కను సహాయక సిబ్బంది రక్షించారు. బంధువులు, స్నేహితుల ఆచూకీ కోసం సన్నిహితులు భవనాల దగ్గరే నిరీక్షిస్తున్నారు. ఒక ఆసుపత్రి సిబ్బంది మొత్తం కూడా శిథిలాల్లో చిక్కుకుపోయారు. వారి యోగక్షేమాలపై సన్నిహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుప్పకూలిన మరో భవనం కింద ఓ మహిళ నలుగురు సంతానం చిక్కుకుపోయారు. సహాయక సిబ్బంది శనివారం సాయంత్రం వరకు శిథిలాల నుంచి 100 మందిని రక్షించారు. 5 వేల మంది సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు.
ఇదీ చూడండి:రాకాసి అలలతో పోటీ పడి గెలిచిన సెబాస్టియన్