టర్కీలో కార్చిచ్చు బీభత్సం కొనసాగుతోంది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఆరు రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఐరోపా సమాఖ్య(ఈయూ) దేశాల నుంచి తీసుకువచ్చిన విమాన ట్యాంకర్ల ద్వారా మంటలపై నీళ్లు జల్లుతున్నారు.
వేల ఎకరాల అడవి కాలి బూడిదైతే... - turkey battling control blaze
కార్చిచ్చు ధాటికి టర్కీ విలవిల్లాడుతోంది. మంటల కారణంగా.. ఇప్పటివరకు ఎనిమిది మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. పెద్దఎత్తున అటవీ సంపద అగ్నికి ఆహుతైపోయింది. మరోవైపు.. మంటలు ఆర్పేందుకు అగ్నిమాక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
మంటల ధాటికి ఆ దేశంలో ఇప్పటివరకు ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. టర్కీలోని 32 రాష్ట్రాల్లో 119 మంటలు చెలరేగాయని ఆ దేశ వ్యవసాయ, విదేశాంగ మంత్రి బెకిర్ పాక్దెమిరిలి తెలిపారు. ఆంటల్యా, ముగ్లా, టున్సెలీ, మనావ్గట్ ఆగ్నేయ టర్కీ ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మంటల ముప్పు ప్రాంతాల్లోని ఇళ్లవారిని అధికారులు ఖాళీ చేయించారు. దావానలం చెలరేగడానికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.