తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇరాన్​కు ట్రంప్ మరోసారి హెచ్చరిక - ఇరాన్​పై ట్రంప్ తాజా వాఖ్యలు

ఇరాన్​లో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో.. ఆ దేశ ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారులను హతమార్చొద్దని ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

trump
ట్రంప్

By

Published : Jan 13, 2020, 5:28 AM IST

Updated : Jan 13, 2020, 7:25 AM IST

ఇరాన్‌ ప్రభుత్వానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్​లో నిరసనకారుల అణచివేతకు వ్యతిరేకంగా ట్విట్టర్​ వేదికగా స్పందించారు.

ట్రంప్ ట్వీట్​

"ఇరాన్‌ నాయకులకు హెచ్చరిక- మీ నిరసనకారులను చంపకండి. ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయారు.. అనేక మందిని జైళ్లల్లో పెట్టారు. ప్రపంచం మొత్తం మిమ్మల్ని గమనిస్తోంది. మరీ ముఖ్యంగా అమెరికా చూస్తోంది. మీ దగ్గర ఇంటర్నెట్‌ ఆన్‌ చేసుకోండి. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియజెప్పేలా మీ జర్నలిస్టులను అనుమతించండి! గొప్పవారైన మీ ఇరాన్‌ ప్రజలను హతమార్చడం ఆపండి." - ట్రంప్​ ట్వీట్​

ట్రంప్​ ట్వీట్​కు కొంత సమయం ముందు ఓ ఇంటర్వ్యూలో.. ఇరాన్​ నేతలతో చర్చలకు ట్రంప్ ఇంకా సిద్ధంగా ఉన్నట్లు అమెరికా భద్రతా కార్యదర్శి మార్క్​ ఎస్పర్​ తెలిపారు.

ఇదీ చూడండి:ఉక్రెయిన్​ విమానం కూల్చివేతకు వ్యతిరేకంగా ఇరాన్​ ప్రజల నిరసన

Last Updated : Jan 13, 2020, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details