తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఉక్రెయిన్​ విమాన ప్రమాదంపై అనుమానాలున్నాయ్​' - అమెరికా ఇరాన్ లేటెస్ట్​ న్యూస్

ఉక్రెయిన్​ విమాన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే తమ దేశం క్షిపణులే పొరపాటున ఉక్రెయిన్​ విమానాన్ని కూల్చి ఉంటాయని వస్తున్న వార్తలను ఇరాన్​ తోసిపుచ్చింది. అవి తప్పుడు ఆరోపణలని కొట్టిపారేసింది.

trump
అనుమానాలున్నాయ్

By

Published : Jan 10, 2020, 5:42 AM IST

Updated : Jan 10, 2020, 8:07 AM IST

ఇటీవల ఇరాన్​లో జరిగిన ఉక్రెయిన్ విమాన ప్రమాదంపై అనుమానాలున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ అన్నారు. ఇరాన్ భద్రతా దళాలు పొరపాటున ఆ విమానాన్ని కూల్చేసి ఉంటాయని అమెరికా మీడియాలో కథనాలు వచ్చిన వెంటనే ట్రంప్ ఇలా స్పందించారు.

"ప్రమాదంపై నాకు అనుమానాలున్నాయి" అని ట్రంప్ అన్నారు

.

ఇరాన్​ రాజధాని టెహ్రాన్​కు సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మొత్తం 176 మంది ప్రాణాలు కోల్పోయారు.

తోసిపుచ్చిన ఇరాన్​..

ఉక్రెయిన్ విమానం కూలేందుకు ఇరాన్​ క్షిపణులే కారణమంటూ వచ్చిన వార్తలను ఆ దేశం తోసిపుచ్చింది. ఆ వాదనలు అర్థం లేనివని కొట్టిపారేశారు ఇరాన్​ అధికారులు.

ఇరాక్​లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్​ క్షిపణుల దాడులు జరిపిన కొద్ది సేపటికే.. ఉక్రెయిన్​ విమానం కుప్పకూలింది. ఈ నేపథ్యంలో ఇరాన్​ క్షిపణులే ఇందుకు కారణమై ఉండొచ్చని అనుమానాలు వచ్చాయి.

ఆ ప్రమాదం జరిగినప్పుడు ఇరాన్​ గగనతలంలో అదే ఎత్తు (8,000 అడుగులు)లో పలు అంతర్జాతీయ, జాతీయ విమానాలు ఎగురుతున్నట్లు ఆ దేశం వెల్లడించింది. ప్రమాదంపై ఉక్రెయిన్​ ప్రభుత్వంతో పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు స్పష్టం చేశారు ఇరాన్​ అధికారులు.

అయితే ఈ వ్యవహారంపై కెనడా, బ్రిటన్ దేశాలు ఇరాన్​ పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ చూడండి:వెనక్కి తగ్గిన ఇరాన్​, అమెరికా.. అయినా ప్రమాదం అంచునే!

Last Updated : Jan 10, 2020, 8:07 AM IST

ABOUT THE AUTHOR

...view details